ప్రేమించబడాలంటే… / ప్రేమ నిలబడాలంటే..

ఒకటి..

ఎప్పుడూ అబద్దం చెప్పకూడదు..


రెండవది…

అప్పుడప్పుడు..అబద్దాలు చెప్పాలి…

ఎందుకంటే…

స్వచ్చమైన బంగారంతో నగలు చేయలేము. అది ఎంతో మృదువైనది. అందుకే దానిని కొంత కల్తీ చేయాలి(వెండి, రాగి ని కలపాలి). అప్పుడే అది(ఆ బంగారం) వాడుకోవటానికి పనికొస్తుంది.

ప్రేమ కూడా అంతే!. స్వచ్చమైన ప్రేమ, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆ ప్రేమ నిలబడాలంటే…కొంత కల్తీ చేయక తప్పదు. ఇప్పుడు ఆ స్వచ్చమైన ప్రేమ కి కొంచెం స్వార్ధం,అబద్దాన్ని కలపండి. ఇప్పుడు మీ ప్రేమ, కలకాలం నిలబడుతుంది. నలుగురిలోనూ గట్టిగానూ నిలుస్తుంది.

Oops

తెలివితేటల్లోనే కాదు… తెలివి తక్కువతనం లో కూడా నువ్వు నన్ను గెలవలేవు!

సైకం రాజు

ఎందుకంటే నేను OOPSలో ఎక్స్పర్ట్ ని…

Oops: https://en.wikipedia.org/wiki/Oops

OOPs: https://en.wikipedia.org/wiki/Object-oriented_programming

Image by S K from Pixabay

ఐ !

నన్ను ఓడించిన శత్రువు లేడు!
నేను గెలిచిన యుద్దం లేదు!

ప్రేమకు కరగని క్షణమే లేదు!
కరిగిన క్షణాలలో ప్రేమే లేదు!

పిలిచిన వేళలో పలకని దైవం లేడు!
దైవం పలికిన వేళలో నేనే లేను!

Photo by ÉMILE SÉGUIN ✳️✳️✳️ on Unsplash